కథా సరిత్సాగరం

కథా సరిత్సాగరం

కథలు… ముఖ్యంగా ప్రాచీన జానపద కథలంటే ఇష్టపడేవారికి ఓ శుభవార్త! భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు అనే బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినట్లుగా తెలుస్తోంది. ఇది గుణాఢ్యుడు అనే పండితుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన పైశాచీ భాషలో రాసిన బృహత్కథ ఆధారంగా రాయబడింది. కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు రాయబడినట్లుగా తెలుస్తోంది. ఈ కథల్ని 18 పుస్తకాలు, 124 అధ్యాయాలు, 21000 శ్లోకాల్లో రాశారు. ఇవన్నీ మహారాజు ఉదయనుడి కుమారుడైన నరవాహనదత్తుడి సాహసాల చుట్టూ తిరుగుతాయి.

నవరసభరితమైన ఈ కథల్ని సరళ తెలుగు భాషలో నవ్య తెలుగు వారపత్రిక లో ధారావాహికంగా ప్రచురిస్తున్నారు. ఆ పత్రికలో రచయిత(త్రి) అనీలజ అని పేర్కొన్నారు. వారి అసలు పేరు ఎవరికైనా తెలిసుంటే చెప్పండి.

1920 ప్రాంతాల్లో సీ హెచ్ టౌనీ, ఎన్.ఎం పెంజర్ అనే ఇరువురు ఆంగ్ల రచయితలు కలిసి సోమదేవుడు రాసిన సంస్కృత రచనలను పది భాగాల్లో ఆంగ్లం లోకి అనువాదం చేశారు. ఆ పుస్తకాల పీడీఎఫ్ లు ఆర్కైవ్.ఆర్గ్ సైటులో ఉచితంగా లభ్యమౌతున్నాయి. ఈ పది పుస్తకాల లంకెల కోసం ఈ ఆంగ్ల వికీ పేజీ లోని References విభాగంలో చూడండి.

మరి ఇంకెందుకాలస్యం?…. జానపద కథా జగత్తులో విహరించండి!!

4 Responses to కథా సరిత్సాగరం

  1. పంతుల జోగారావు అంటున్నారు:

    కథా సరిత్సాగరం నవ్య వార పత్రికలో సరళ వ్యావహారికంలో వ్రాస్తున్న అనీలజ అంటే, ఆ పత్రికా సంపాదకులు శ్రీ ఎన్.జగన్నాథ శర్మ గారు.
    అనీలజ వారి కలం పేరు.

  2. పంతుల జోగారావు అంటున్నారు:

    అనీలజ గారి పూర్తి పేరు … అయలసోమయాజుల నీలకంఠ జగన్నాధ శర్మ

  3. lalitha అంటున్నారు:

    maa chanti daniki telugu patalu padyalu kadhalu alavatu cheyalani aa links ni sekaristunnanu… ee post chalaaaaa upayogapdutundi… dhanyavadalu :)

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 28 other followers