నేను గాల్లో ఎగురుతున్నాను

ఆకాశ వీధిలో

ఆకాశ వీధిలో


ఒక అబ్బాయి అనాథాశ్రమంలో పెరుగుతూ ఉండేవాడు.


ఆ అబ్బాయికి ఎప్పుడూ పక్షుల్లాగా గాల్లో ఎగరాలని ఆశ. అసలు తాను వాటిలాఎందుకు ఎగర లేకపోతున్నాడో అతనికి ఎంత ఆలోచించినా అంతుపట్టేది కాదు.

“నా కంటే పెద్దగా ఉన్న పక్షులు కూడా ఎగరడం చూశానే…అసలు నేను ఎందుకు ఎగరలేక పోతున్నాను? నాలో ఏదైనా లోపం ఉందా” అని అనుక్షణం మధనపడుతుండేవాడు.

అలాగే ఇంకో చోట పోలియో వ్యాధి బారిన పడ్డ మరో బాలుడుండేవాడు. అతనికెప్పుడూ తను అందరి లాగా నడవలేకుండా పరిగెత్త లేకుండా ఉన్నానని బాధ గా ఉండేది.

ఇలా ఉండగా ఒకరోజు అనాథ అబ్బాయి ఆశ్రమం నుంచి పారిపోయి వచ్చేశాడు. ఒక పార్క్ ఎదురుపడితే అందులో ప్రవేశించాడు. అక్కడ పైన చెప్పిన కాళ్ళు సరిగా లేని అబ్బాయి ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టి ఆడుకుంటూ తారసపడ్డాడు.

నెమ్మదిగా ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళి “నీకెప్పుడూ గాల్లో ఎగరాలనిపించలేదా?” అని ప్రశ్నించాడు.

“ప్చ్ లేదు… కానీ మీలాగా నడవాలని, పరిగెత్తాలని మాత్రం ఆశగా ఉంది” అన్నాడు.

దానికి అనాథ అబ్బాయి కించిత్తు బాధ పడుతూ “సరే మనిద్దరం స్నేహితులుగా ఉందామా?” అని అడిగాడు.

“ఓ తప్పకుండా” అన్నాడు ఆ అబ్బాయి.

వాళ్ళిద్దరూ కలిసి గంటల తరబడి తనివిదీరా ఆడుకున్నారు. ఇసుకతో కోటలు కట్టారు. గిలిగింతలు పెట్టుకున్నారు. మనసారా నవ్వుకున్నారు. కాసేపటి తర్వాత నడవలేని అబ్బాయి తండ్రి అతన్ని తీసుకెళ్ళడానికి చక్రాల కుర్చీ తీసుకుని వచ్చాడు.

అనాథ అబ్బాయి నెమ్మదిగా ఆయన దగ్గరికెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు.

“ఓ అలాగే” అన్నాడాయన.

అతను నెమ్మదిగా నడవలేని అబ్బాయి దగ్గరికెళ్ళి,

“నువ్వు నాకు ఒక్కగానొక్క స్నేహితుడివి. నీ అంతట నువ్వు అందరిలాగా నడవడానికి, పరిగెత్తించేలా చేయడానికి నేనేం చేయలేను. కానీ ఒక్కటి మాత్రం చెయ్యగలను.”

అని చెప్పి వెనక్కు తిరిగి ఆ అబ్బాయిని వీపు మీద ఎక్కమన్నాడు (ఉప్పుగుర్రం అనేవాళ్ళం చిన్నప్పుడు).

అతను అలా ఎక్కగానే నెమ్మదిగా పచ్చిక మీద పరిగెత్తడం ప్రారంభించాడు. శక్తి కొద్దీ పరిగెత్తుతూ వేగం నెమ్మదిగా పెంచుతున్నాడు. అలా వేగం పెరుగుతున్న కొద్దీ పిల్లగాలి వారి ముఖాలను చల్లగా పలకరిస్తోంది. ముంగురులు పైకెగురుతూ ఉన్నాయి. వారిద్దరి ముఖాల్లో సంతోషం తాండవిస్తోంది.

దూరంగా కూర్చుని వీరివైపే తదేకంగా చూస్తున్న నడవలేని అబ్బాయి తండ్రి తన కొడుకు వైపు చూస్తూ ఆనంద భాష్పాలు రాలుస్తూ ఉన్నాడు

ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే

ఆనందంగా చప్పట్లు కొడుతూ చేతులూ రెండూ రెక్కల్లా సాచి “నాన్నా… నేను గాలి లో ఎగురుతున్నాను చూడు..” అని అరుస్తున్నాడు.

15 Responses to నేను గాల్లో ఎగురుతున్నాను

  1. మధురవాణి అంటున్నారు:

    ఎంత నిష్కల్మషమైన హృదయాలు చిన్న పిల్లలివి!
    చాలా అందంగా, హృద్యంగా ఉందండీ మీ కథ!

  2. శ్రీవాసుకి అంటున్నారు:

    బాగుంది. మరి నన్నెప్పుడు ఉప్పుగుర్రం ఎక్కిస్తారు.

  3. harekrishna అంటున్నారు:

    excellent writing ravichandra gaaru

  4. అభిజ్ఞాన అంటున్నారు:

    Wonderful story!

  5. krishna అంటున్నారు:

    చాలా చాలా బాగుంది.అసలు మాటల్లో ఎంత బాగుందో చెప్పలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.

  6. Lalitha అంటున్నారు:

    Wonderful! Ekkada chadivaru? Meere rasara?

  7. Krishna Mohan అంటున్నారు:

    చాలా చాలా బాగుంది super

  8. Malakpet Rowdy అంటున్నారు:

    Nice one! Loved reading it!

  9. రవి చంద్ర అంటున్నారు:

    @శ్రీవాసుకి , @harekrishna, @అభిజ్ఞాన, @krishna, @radhika, @krishna mohan
    అందరికీ థాంక్స్….

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 28 other followers