ఈ-తెలుగు స్టాల్ కొసమెరుపులు

e-తెలుగు బృందం

e-తెలుగు బృందం

నిన్నటితో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ముగిసింది.దాంతో పాటూ e-తెలుగు స్టాల్ కూడా. చివర్లో మేం చేసిన సందడి గురించి చెప్పకపోతే కొన్ని మధుర క్షణాలు కోల్పోయినట్లే. గతేడాది పద్మనాభం గారు మొదలు పెట్టిన సాంప్రదాయం ఈ సారీ కొనసాగించాం. స్టాల్ తెర మూసేసి లోపల గా……………..ట్టిగా జాతీయ గీతాన్ని ఆలపించాం. అలాగే స్టాల్ నిర్వహణలో సహకరించిన అందరికీ గా……….ట్టిగా ఓయేసుకున్నాం.

అంతటితో ఆగకుండా ప్రదర్శన బయటకు వచ్చి టీమిండియా విజయోత్సవం లాగా అందరం చేతులమీద చేతులేసుకుని గుంపుగూడి గా…ట్టిగా మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలపించాం. మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మమ్మల్ని ఆసక్తిగా గమనించడం కనిపించింది. మొత్తమ్మీద గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్ళగలిగినందుకు అందరూ సంతృప్తి చెందారు.

17 Responses to ఈ-తెలుగు స్టాల్ కొసమెరుపులు

  1. sudha అంటున్నారు:

    రవి చంద్ర గారు మీరు అందరూ కలసి ఈ-తెలుగు స్టాలు సమర్ధవంతంగా నిర్వహించినందుకు, విజియోత్సవ సంబరాలు మధురంగా జరుపుకున్నందుకు శుభాకాంక్షలు. మీ అందరిని కలసినందుకు చాలా ఆనందించాము. మీ ఫొటో లో సుజాత గారు మిస్ అయ్యారు. ఈ- తెలుగు దిన దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ..

    సుధ

  2. సుజాత అంటున్నారు:

    ఇప్పుడు హైదరాబాదున్న పరిస్థితుల్లో బయటికొచ్చి గా…ట్టిగా “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” పాడారంటే మీ ధైర్యానికి, మీ భాషాభిమానానికి మిమ్మల్ని అభినందించాల్సిందే!

  3. neelaanchala అంటున్నారు:

    రెండు వివాదాస్పద గీతాల్ని పాడారన్నమాట! సెభాష్!;-)

  4. Purnima అంటున్నారు:

    cool!
    నేనింకా కాసేపు ఉండాల్సింది..

  5. Indian Minerva అంటున్నారు:

    జణగణమణ పై వివాదం “మాతెలుగుతల్లికి” “టైపు”ది కాదులేండి కాబట్టి ఫత్వాలేదు సారీ ఫర్వాలేదు :)

  6. neelaanchala అంటున్నారు:

    Indian Minerva, …”ఫత్వాలేదు సారీ ఫర్వాలేదు”….ఇక్కడే వివాదమేదో చెప్పేశారుగా!:-)

  7. నరేష్ నందం అంటున్నారు:

    నేను రావటం కుదరలేదు.. కానీ మనసంతా e-తెలుగు స్టాల్‌లోనే ఉండిపోయింది.
    మీఅందరికీ అభినందనలు!

    జై తెలుగుతల్లి!

  8. నాగప్రసాద్ అంటున్నారు:

    గ్రేట్!! అభినందనలు.

  9. KRISHNA MOHAN అంటున్నారు:

    అభినందన తెలుగందనములు

  10. రవి చంద్ర అంటున్నారు:

    అందరికీ ధన్యవాదాలు :-)

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 28 other followers