నీ కోరికేంటి? :)
డిసెంబరు 2, 2009 అభిప్రాయములు
ఒక ధనవంతుడికి పెళ్ళికాని అందమైన కూతురుండేది. ఆయన తన బంగళా వెనుక ఒక కొలనులో భయంకరమైన మొసళ్ళను పెంచేవాడు. ఒక రోజు ఆయన పెద్ద పార్టీని ఏర్పాటు చేసి చాలా మందిని ఆహ్వానించాడు. అందులో ఇలా ప్రకటించాడు.
“ఇక్కడున్న యువకులందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఎవరైతే ఈ సరస్సులో దూకి మొసళ్ళ నుండి తప్పించుకుని బయటకు ఈదుకుని వస్తారో వారికి నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను లేదా ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను”.
ఆయన మాటలు పూర్తి కాక ముందే ఎవరో నీళ్ళలో దూకిన చప్పుడైంది. నీళ్ళలో ఒక యువకుడు తన శాయశక్తులా ఈదుతూ వస్తున్నాడు. పార్టీకి విచ్చేసిన అతిథులంతా అరుస్తూ అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. చివరికి చిన్న చిన్న దెబ్బలతో, చిరిగిపోయిన చొక్కాతో అవతలి ఒడ్డుకి చేరుకున్నాడా యువకుడు.
ఆ ధనవంతుడు ఆశ్చర్యంతో దగ్గరికి వచ్చి ” నాకు నిజంగా నమ్మశక్యం కాకుండా ఉంది. పరమాద్భుతం. ఇది ఎవరూ పూర్తి చేస్తారని అనుకోలేదు. కానీ నేను మాట తప్పను. చెప్పు. నీకు మా అమ్మాయి కావాలా? ఒక మిలియన్ డాలర్లు కావాలా?”
“నాకు నీ కూతురూ వద్దూ, ఆ మిలియన్ డాలర్లూ వద్దు. ముందు నన్ను నీళ్లలో తోసిన వాణ్ణి చూపించండి!!!!”

intaku mundu ituvanti joke chadiva kaani idi bagundi narration bagundi
ఇంటి వెనుక మొసల్లు పెంచడమెమితొ గొప్పోల్లు ఎం చెసిన అందమె ?
baagundi .
bagundi
మాస్టారు, మీ శైలి బాగుంటుంది. ఇలాంటి జోకులు, సామెతలు గట్రా వ్రాసే బదులు, సాలిడ్ మేటర్ తో టపాలు వ్రాయవచ్చుగా ):-?
అవును. కానీ సాలిడ్ మాటర్ తో రాయాలంటే సమయం చిక్కడం లేదు. సమయం చిక్కినపుడు రాస్తూనే ఉన్నాను.
భలే రాస్తారండి