రియాల్టీ షో లా? బూతు పురాణాలా?
అక్టోబర్ 27, 2009 అభిప్రాయములు
ఈ మద్యనే జీటీవీలో ప్రసారమవుతున్న ఆట జూనియర్స్ కార్యక్రమం చూడవలసి వచ్చింది. ఇద్దరు మెంటర్ల మద్య చెలరేగిన వాగ్యుద్ధం చివరికీ అందరికీ పాకింది.
ఒక మెంటర్ (తెలుగులో మార్గదర్శకులు అందాం). ” హలో మీరు xxx, xxx మూసుకుంటే బాగుంటుంది.” అంది . ఒక్క క్షణం దిమ్మ తిరిగిపోయింది నాకు. దాన్నుంచి తేరుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. (xxx, xxx సెన్సార్ కట్ అన్నమాట. నేనే కాదు టీవీలో కూడా కత్తెరేశారు సదరు మాటల్ని)
మళ్ళీ మాటీవీలో ప్రసారమవుతున్న చాలెంజ్ కార్యక్రమంలో ఒక న్యాయ నిర్ణేత పై మాటలు అన్న ఆమె మీద ఇలా అరుస్తున్నాడు.
” నీ లాంటి వేస్ట్ ఫెలో ని నా లైఫ్ లో నేనింత వరకు చూడలేదు”. ఇలా ఏవేవో అవాకులూ చెవాకులూ, చూసేవాళ్ళకు చిరాకులూ.
ఎవరో కొంత మంది అనామకుల్ని పట్టుకుని వాళ్ళతోనే అన్ని కార్యక్రమాలు చేయించి ప్రేక్షకుల్ని శిక్షిస్తున్న ఆ హింసరాజు ను ఏమనాలో నాకు తోచలేదు. వాళ్ళ మ్యానరిజమ్స్, ఏడుపులు, పెడబొబ్బలు టీవీ కార్యక్రమాలంటేనే ఏహ్య భావం కలిగించేలా అనిపించాయి నాకు. టీ.ఆర్.పి రేటింగ్ ల కోసం ఒకటి తర్వాత ఒకటి టీ వీ చానల్స్ కూడా అతని కార్యక్రమాలను ఎగబడి కొనుక్కుంటూ ఉండటం మరీ దారుణం.
ఓ దేవుడా! ఈ ఘీంకార్ బారి నుంచి మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు?
ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అన్ని చానళ్ళలో వస్తున్న రియాల్టీ షోలలో ఇది పరిస్థితి నెలకొని ఉన్నది.

ఇటీవలి వ్యాఖ్యలు